ప్రభాస్ ఆదిపురుష్ మరో శక్తి అవుతుందా?

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం ‘స‌లార్’ తో పాటూ నాగ్ అశ్విన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ నిన్న వచ్చేసింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది.

నిన్న ‘ఆదిపురుష్’ టీజర్ ని అయోధ్య లో రిలీజ్ చేసారు. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి స‌ర్వ నాశ‌నం వ‌స్తున్నా.. న్యాయం రెండు పాదాల‌తో ప‌ది త‌ల‌ల నీ అన్యాయాన్ని అణ‌చి వేయ‌డానికి.. నా ఆగ‌మ‌నం.. అధ‌ర్మ విధ్వంసం.. – ప్ర‌భాస్ అన్న డైలాగులు ఇవి.

గాల్లో బాణాల వ‌ర్షం, వాన‌రుల యుద్ధం, ప‌ది త‌ల‌ల రావ‌ణాసురిడి విన్యాసం, సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆకారం, చివ‌ర్లో జై శ్రీ‌రామ్ మంత్రం.. ఇలా ఏ ఫ్రేమ్‌ చూసినా విజువ‌ల్ ఎఫెక్ట్సే క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా దాదాపుగా బ్లూ మేట్ లో తీశారు. సెట్స్ వేసింది చాలా తక్కువ‌. ఆ విష‌యం టీజ‌ర్ చూస్తే అర్థ‌మైపోతోంది.

అయితే ఈ మూవీ ని మోషన్ కాప్చర్ లో తీసినట్టు తెలిసిపోతుంది. దీంతో ఫాన్స్ కొంత నిరాశ చెందారు. గ్రాఫిక్స్ కూడా వరల్డ్ క్లాస్ లేవని అంటున్నారు. ట్రోలర్స్ అయితే ఈ సినిమా మరో ‘శక్తి’ అవుతుందని ట్రోల్ చేసేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా  2023లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిసింది.