ఈసారి లవ్ ఎఫైర్, విడాకుల గురించి నాగచైతన్య మాట్లాడనున్నాడా..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగచైతన్య గత కొన్ని రోజుల నుంచి తన విడాకుల విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక ఈ మధ్య మాత్రం మరో హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లు బాగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈయన వీటి గురించి స్పందిస్తాడు అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన థాంక్యూ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా లాల్ సింగ్ చద్దా సినిమాల్లో కూడా నటించగా ఈ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. ఇక దీని ప్రమోషన్స్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఆ సమయంలో మీడియా నాగచైతన్యకు సమంత విడాకులతో పాటు, లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.