Naga Babu: జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు..? షికారు చేస్తున్న పుకార్లు..!

Naga Babu: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఈటీవీ లో జబర్దస్త్ కామెడీ షో మొదలైన నాటి నుండి మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా జడ్జ్ లుగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా నాగబాబు కాస్త నవ్వుల రారాజు గా పాపులర్ అయ్యారు. అయితే అంత సజావుగా సాగిపోతున్న సమయంలో నాగబాబు అకస్మాత్తుగా జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. అందుకు పలు రకాల కారణాలు అప్పట్లో వినిపించాయి. అయినప్పటికీ మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్థల కారణంగా నాగబాబు జబర్దస్త్ ని వీడినట్టు సమాచారం.

నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన తర్వాత రోజా జబర్దస్త్ బాధ్యత భుజాన వేసుకుంది. దాదాపు 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ షో కీ జడ్జ్ గా వ్యవహరించింది. ఒకవైపు ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ జబర్దస్త్ ను వీడలేక జడ్జ్ గా కొనసాగింది. కాని ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ పునవ్యవస్తీకరణ కారణంగా రోజా కి మంత్రి పదవి దక్కటంతో తన సమయాన్ని కేవలం ప్రజలకోసమే కేటాయిస్తానని, అందువల్ల జబర్దస్త్ షో కి స్వస్తి పలికినట్లు అధికారికంగా ప్రకటించారు. రోజా జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో ఆవిడ స్థానాన్ని ఎవరు పూర్తి చేస్తారు అన్న విషయాల గురించి చర్చ జరుగుతూనే ఉంది.

అయితే ఇటీవల ఈ విషయం గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రోజా జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో ఆ స్థానంలో నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రోజా నాగబాబు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు అని, ఇప్పుడు రోజా జబర్దస్త్ కి స్వస్తి చెప్పటంతో నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని మెగా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల వారి తో వచ్చిన మనస్పర్థల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి, ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. అందువల్ల ఎట్టిపరిస్థతుల్లోనూ నాగబాబు జబర్దస్త్ లో కనిపించే అవకాశం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.