అజ్ఞాతవాసం వీడిన హైపర్ ఆది మళ్ళీ జబర్దస్త్ లో కనిపించనున్నాడా..?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా పరిచయమైన హైపర్ ఆది తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి టీం లీడర్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది తన కామెడీ టైమింగ్ తో పంచులతో చేసే సందడి అంతా ఇంతా కాదు. హైపర్ ఆది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత అందరినీ వెనక్కినెట్టి జబర్దస్త్ కి మూలస్తంభంలా తయారయ్యాడు.

ఆది జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే గత కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవటంతో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల వారితో గొడవ కారణంగా హైపర్ ఆది జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లకు దూరమయ్యాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం వరుస సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఆది ఈ షోలో మానేశాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆది ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లలో రీఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నాడు. దీంతో తొందర్లోనే ఆది జబర్థస్త్ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి ఇప్పటి వరకూ ఆది ఎక్కడ స్పందించలేదు. మొత్తానికి బుల్లి తెర మీద మళ్ళీ హైపర్ ఆది సందడి మొదలవుతున్నందుకు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొందర్లోనే ఆది జబర్థస్త్ లో కూడ స్కిట్ లు చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.