Deepthi Sunaina And Shannu : దీప్తి సనయన, షన్నూ విడిపోతున్నారా.? నిజమేంటంటే.!

Deepthi Sunaina And Shannu :  ఇదో బిగ్ క్వశ్చన్. దీప్తి సునయన, షన్ముఖ్ జస్వంత్ విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తనను చాలాసార్లు ఆర్థికంగా ఆదుకుందనీ, చాలా సంద్భాల్లో తనకు అండగా నిలిచిందనీ, మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిందనీ పదే పదే బిగ్ హౌస్‌లో వున్నప్పుడు చెబుతూ వచ్చాడు షన్నూ.

అలాంటి షన్నూ, దీప్తి సునయనని ఎందుకు వదులుకుంటాడు.? కానీ, బిగ్ బాస్ సీజన్ ముగిశాక ఇప్పటివరకు షన్నూ, దీప్తి కలుసుకోలేదు. వీళ్ళిద్దరి మధ్యా చిలిపి తగాదాలు తరచూ జరుగుతుంటాయట. రెండు మూడు నెలలు ఇద్దరూ మాట్లాడుకోరట కూడా. గతంలో కూడా ఇలాంటివి జరిగాయని షన్నూ అంటున్నాడు.

ఇదేమన్నా దేశానికి ముప్పు తెచ్చే సమస్యా.? ఇంతలా ఈ అంశం చుట్టూ ఎందుకు చర్చ జరుగుతోంది.? అని చాలామంది వెటకారాలు చేస్తున్నారు. అయితే, దీప్తి తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందంటూ షన్ముఖ్ ప్రకటించడంతో, ఈ వ్యవహారంపై సహజంగానే చర్చ జరుగుతుంటుంది. సెలబ్రిటీలకు, వారి వ్యక్తిగత జీవితాలకు అభిమానుల్లో వున్న క్రేజ్ అలాంటిది మరి.

సిరి హన్మంత్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ, ఆమెను ఆమె బాయ్ ఫ్రెండ్ వదిలేయలేదు. ఇద్దరూ కలుసుకున్నారు. త్వరలో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారట కూడా. కానీ, షన్ముఖ్ కారణంగా సిరి తన బాయ్ ఫ్రెండ్కి దూరం కాబోతోందంటూ ప్రచారమెందుకు జరిగింది.? అదో పబ్లిసిటీ స్టంట్ గనుక.

దీప్తి విషయంలో కూడా కొన్నాళ్ళపాటు ఈ కథ ఇలాగే నడుస్తుందట. ఇదంతా ఓ పెద్ద ప్లానింగ్.. అని అంటున్నారు.