శంకర్ మాటను చిరు నమ్ముతారా ?

Ram Charan believe Shankar
Ram Charan believe Shankar
 
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే.  శంకర్ తో సినిమా చేయాలని చిరంజీవి చాలా ట్రై చేశారు.  కానీ కుదరలేదు. ఇప్పుడు చరణ్ కు ఆ ఛాన్స్ వచ్చేలా చేశారాయన.  అన్నీ దగ్గరుండి చూసుకుని ప్రాజెక్ట్ సెట్ చేశారు.  భారీ బడ్జెట్ కోసం దిల్ రాజును రంగంలోకి దింపారు.  ఏకంగా చరణ్ కోసం పాన్ ఇండియా మూవీని సెట్ చేసి పెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ కంప్లీట్ కాగానే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే అవన్నీ జరిగేలా లేవు.  
 
‘ఇండియన్ -2’ రూపంలో శంకర్ చుట్టూ కష్టాలు చుట్టుకున్నాయి. ఆ సినిమా మొదలైన దగ్గర్నుండి ఆయనకు వరుస ఇబ్బందులే.  బడ్జెట్ విషయంలో లైకా నిర్మాతలకు శంకర్ కు పడట్లేదు.  అడిగినంత ఇవ్వలేదని శంకర్, ఇచ్చిన దాంట్లోనే సినిమా కంప్లీట్ చేయమని లైకా నిర్మాతలు. దీని మూలంగానే సినిమా ఆగిపోయింది.  విషయం కోర్టులో నడుస్తోంది. ‘ఇండియన్-2’ పూర్తి చేశాకే శంకర్ కొత్త సినిమా అంటే రామ్ చరణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి వచ్చేలా ఉంది.  ‘ఇండియన్-2’ పూర్తికావాలి అంటే ఇంకో నాలుగైదు నెలలు పడుతుంది.  కాబట్టి ఈ ఏడాది ఆఖరులో కూడ చరణ్ సినిమా మొదలయ్యే సూచనలు ఉండవు. శంకర్ ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ నెల అటు ఇటు అయినా సినిమా మొదలుపెట్టాల్సిందే అన్నట్టు ఉన్నారట.  మరి ఆయన్ను చిరు, చరణ్ నమ్ముతారో లేదో.