ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడవా చంద్రబాబు?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో గురించి జోరుగా చర్చ జరుగుతోంది. గోరంట్ల మాధవ్ నిజంగానే తప్పు చేశాడని కొంతమంది నమ్ముతుంటే మరి కొందరు మాత్రం గోరంట్ల మాధవ్ ను ఎవరో టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించారని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు కూడా ప్రస్తావనకు వస్తోంది. ఓటుకు నోటు కేసుతో పోల్చి చూస్తే గోరంట్ల మాధవ్ కేసు పెద్ద కేసు కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఒక ఎమ్మెల్యేకు నగదు ఆఫర్ చేసి దొరికిపోయారు. అయితే ఆ కేసు గురించి మాట్లాడటానికి కానీ, ఆ కేసు గురించి వివరణ ఇవ్వడానికి కానీ చంద్రబాబు ఆసక్తి చూపలేదు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం అయింది. ఈ కేసు వల్లే చంద్రబాబు చాలా సంవత్సరాల పాటు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

గోరంట్ల మాధవ్ నివేదికను వీలైనంత త్వరగా వెల్లడించాలని కోరుతున్న టీడీపీ నేతలు బాబు వాయిస్ ఒరిజినలో కాదో చెప్పే ప్రయత్నం మాత్రం చేయకపోవడం గమనార్హం. మాధవ్ దోషి అని తేలితే చర్యలు తీసుకుంటామని చెబుతూనే వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. గతంలో వైరల్ అయిన వీడియో ద్వారా ఓటు కొనుగోలును చంద్రబాబు ప్రోత్సహించారని ఆ వీడియో ద్వారా స్పష్టమైంది.

గోరంట్ల మాధవ్ వ్యవహారం నిజమని తేలినా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వైసీపీపై విమర్శలు చేసే ఛాన్స్ కూడా ఉండదు. మరోవైపు మాధవ్ నివేదిక కూడా అంతకంతకూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నివేదిక వచ్చినా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ కు క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.