Bindu Madhavi Get Justice This Time : బిందుమాధవికి ఈ సారైనా న్యాయం జరుగుతుందా.?

Bindu Madhavi Get Justice This Time

Bindu Madhavi Get Justice This Time : హీరోయిన్ అవ్వాలని గంపెడు ఆశలతో ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ బిందుమాధవి. ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాతో డెబ్యూ చేసి, ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలతోనే హీరోయిన్‌గా సరిపెట్టుకోవల్సి వచ్చింది తెలుగులో. అయితే, తమిళంలో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుందనుకోండి.

ఇక, ఇప్పుడు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న రియాల్టీ షో ద్వారా బిందు మాధవి పేరు మళ్లీ మార్మోగిపోతోంది. బిగ్‌బాస్ టైటిల్ ఫేవర్ లిస్టులో బిందు మాధవి పేరు బాగా వినిపిస్తోంది.

బుల్లితెరపై ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్ధక్, ఈ ఓటీటీ బిగ్‌బాస్‌లో కూడా కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నసంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అఖిల్ సార్ధక్ అభిమానులకీ, బిందు మాధవి అభిమానులకీ గట్టి వార్ నడుస్తోంది.

బిందు మాధవి విషయానికి వస్తే, గతంలో తమిళ బిగ్‌బాస్‌లోనూ బిందు మాధవికి అన్యాయం జరిగింది. దాదాపుగా టైటిల్ విన్నర్ అవ్వాల్సన బిందుమాధవి, తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ, కొన్ని కారణాలతో ఆమెని లాస్ట్ ఎలిమినేషన్ చేసేశారు. కావాలనే అక్కడ బిందు మాధవికి టైటిల్ దక్కకుండా చేశారన్న ప్రచారం నడించింది అప్పట్లో.

అయితే, తెలుగు బిగ్‌బాస్‌లో ఇంతవరకూ లేడీ కోటాలో ఎవరికీ టైటిల్ దక్కలేదు. ఈ సారి మాత్రం లేడీ కోటాలో బిగ్‌బాస్ టైటిల్ ఇవ్వాలనీ, అది బిందు మాధవికే దక్కాలనీ బిగ్‌బాస్ అభిమానులు కోరుతున్నారు. మరి ఈ సారైనా బిందుమాధవికి న్యాయం జరుగుతుందా.? చూడాలి మరి.