పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఫాలోయింగ్ ఉన్న బన్నీకి పుష్ప సినిమా ద్వార వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా షూటింగ్ రెడీ అవుతున్నాడు. పుష్ప సినిమా సూపర్ హిట్ అవటంతో సుకుమార్ పుష్ప 2 సినిమా మీద మరింత ఫోకస్ పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సుకుమార్ మాత్రం పుష్ప 2 సినిమాకీ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా గడుపుతున్నాడు. పుష్ప సినిమా సూపర్ హిట్ అవ్వటంతో పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా పుష్ప 2 తెరకెక్కించాలని సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమ తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమ షూటింగ్ జూలై నెలలో పట్టలెక్కనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు పై అంతటా ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమా తర్వాత కొరటాలతో శివతో సినిమా చేయనున్నట్టు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించాడు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మీద ఫోకస్ పెట్టాడు. దీంతో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయటానికి రెడీ అయ్యాడు. తొందరలోనే వీరిద్దరూ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 సినిమ షూటింగ్ మొదలు కాబోతోంది. అల్లు అర్జున్ ఒకే అంటే అతనితో సినిమా తీయటానికి తమిళ్ డైరెక్టర్ మురుగదాస్, త్రివిక్రమ్, కొరటాల వంటి వారు రెడీగా ఉన్నారు. అయితే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అధికారిక సమాచారం దసరా పండుగ రోజున రానున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.