Crime News: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కుటుంబంతో సంతోషంగా ఉండకుండా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి అంటే చాలు దానికి కారణం అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. ఒక భర్త తన భార్య వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడు.సైదాపూర్ మండలం , సోమారం గ్రామానికి చెందిన రాజేశం.. తన భార్యతో కలిసి కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అతడి భార్య అటవీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తోంది.ఈ క్రమంలో అదే ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తున్న శశిధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త దృష్టికి వెళ్ళటంతో పెద్దలలో చెప్పి భార్యను పద్దతి మార్చుకోవాలని మందలించాడు. అందుకు భార్య స్పందిస్తూ తనని కావాలనే అనుమానిస్తున్నారనీ, ఐతే ఆధారాలు ఉంటే చూపించండి అంటూ వాదించింది.
దీంతో ఆమె భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకుననీ ఆమెపై నిఘా ఉంచాడు. ఈ క్రమంలో ఇటీవల తన భార్య టైపిస్టు తో కలిసి ఒకే గదిలో ఉండటం ఆయన దృష్టికి తన భార్య అక్రమ సంబంధాన్ని ఆధారాలతో నిరూపించారనితన భార్య అక్రమ సంబంధాన్ని ఆధారాలతో నిరూపించాలని ఆ గదికి తాళం వేసి పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజేశం భార్యని, టైపిస్ట్ శశిధర్ ని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపంతో రాజేశం టైపిస్ట్ కి దేహశుద్ధి చేశాడు.