పూనమ్ కౌర్ పేరెందుకు వైసీపీ వివాదంలోకి లాగుతోంది.?

సినీ నటి పూనమ్ కౌర్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు. కానీ, సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గానే వుంది. అవకాశాల కోసం తనవంతు ప్రయత్నం చేస్తోంది. అడపా దడపా రాజకీయాలపై తనకు తోచిన రీతిలో సోషల్ మీడియాలో స్పందిస్తుంటుంది పూనమ్ కౌర్. స్టార్ హీరోయిన్ అనిగానీ, ఓ మోస్తరు హీరోయిన్ అనిగానీ.. పేరు ప్రఖ్యాతులు పూనమ్ కౌర్ సంపాదించుకపోయిన మాట వాస్తవం. ఆమెకు పెద్దగా హిట్ సినిమాలు పడలేదు. కానీ, పవన్ కళ్యాణ్ పేరుతో ముడిపెడుతూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ముడిపెడుతూ పలు సందర్భాల్లో పూనమ్ కౌర్ పేరు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇంకోపక్క సోషల్ మీడియాలో మార్మోగిపోతుంటుంది.

‘గురూజీ’ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ గతంలో ఆమె పలు ట్వీట్లు వేయడం వివాదాస్పదమయ్యింది. మరోపక్క, పవన్ కళ్యాణ్ – పూనమ్ కౌర్ మధ్య ఏందో సంబంధం వుందంటూ పవన్ కళ్యాణ్ అంటే గిట్టనివారు ప్రచారం చేస్తుంటారు. ‘ఏం జాతి మీది.?’ అంటూ ఈ పుకార్లపై పూనమ్ కౌర్ పలు సార్లు స్పందించింది కూడా. ఇప్పుడు ఇంకోసారి పూనమ్ కౌర్ పేరు ప్రచారంలోకి వచ్చింది.. అదీ పవన్ కళ్యాణ్ – ఏపీలోని అధికార పార్టీ మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో. ‘పంజాబీ యువతికి అన్యాయం..’ అంటూ పోసాని, పవన్ మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పూనమ్ కౌర్ పేరుని ప్రచారంలోకి తీసుకొచ్చారు. గతంలోనే ఇలాంటి దుష్ప్రచారాలపై పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ ఈసారి ఏం చేయబోతున్నారు.? వేచి చూడాల్సిందే.