రామా రావు, నాగేశ్వర్ రావు తర్వాత ఆ తర్వాతి తరం లో అంతటి సూపర్ స్టార్స్ అంటే కృష్ణ, శోభన్ బాబు మాత్రమే. వీరికి పోటీగా కృష్ణం రాజు వున్నా కూడా, వీళ్లిద్దరికీ ఉన్నంత ఫాలోయింగ్ కృష్ణం రాజుకి లేదు. కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. కానీ శోభన్ బాబు కి చాలా కాలం పట్టింది. జీవనోపాధి కోసం వచ్చిన చిన్న వేషాలు కూడా చేసుకుంటూ కృష్ణ కంటే చాలా లేట్ గా స్టార్ హీరో అయ్యాడు శోభన్ బాబు.
శోభన్ బాబు స్టార్ హీరో అయ్యాక కృష్ణ తో చాలా సినిమాల్లో కలిసి నటించాడు. వీరిద్ధరి కాంబోలో కృష్ణార్జునులు, దొంగలు, మహాసంగ్రామం, ముందడుగు ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 మల్టీస్టారర్ సినిమాలు తీశారంటే అది మామూలు విషయం కాదు.
అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘మహాసంగ్రామం’ సినిమా మల్టీస్టారర్ గా చివరి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో శోభన్ బాబు రోల్ కి సంబంధించిన చాలా సీన్స్ కట్ చేసి చివరికి శోభన్ బాబు ని గెస్ట్ లా చూపించారని అభిమానులు చాలా గొడవ చేసారు. దీనితో ఇంక కృష్ణ తో నటించకూడదని శోభన్ బాబు నిర్ణయించుకున్నారట.