Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని నేను ఆరాటపడుతున్నాను కానీ ఇప్పటివరకు సినిమా సంఘాలు ఒకరు కూడా ముఖ్యమంత్రిని కలవలేదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటివరకు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవకపోవడం బాధాకరం… మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఈయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ పట్ల సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కూడా కళాకారులే. అసలు సీఎంని ఎందుకు కలవాలని ప్రశ్నించారు. మరి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సీఎంని కలవాల్సిన అవసరం ఏముందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ కు సరైన విధంగా కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరికొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఈ వీడియో ఇప్పటిది కాదని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే అప్పట్లో జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఈ వ్యాఖ్యలు సరిగ్గా సూట్ అయ్యాయి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.