Shahrukh Khan : కాదేదీ వివాదానికి అనర్హం.. అన్న మాటే నిజమిప్పుడు. ఔను, దేన్నయినా వివాదంగా చిత్రీకరించొచ్చు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఇటీవల కోవిడ్ సోకి తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియల సందర్భంగా ‘ఉమ్మి వేశాడు’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.
పదుల సంఖ్యలో మీడియా కెమెరాలు తనను చూస్తుంటాయన్న కనీస ఇంగితం షారుక్ ఖాన్‌కి వుండకుండా వుంటుందా.? వందలాది మంది తనను గమనిస్తున్నానరని షారుక్ అనుకోకుండా ఎలా వుంటాడు.? లతాజీ పార్తీవ దేహానికి షారుక్ ఖాన్ నివాళులర్పించాడు.. రెండు చేతలతో ప్రార్థన కూడా చేశాడు.
అంతలోనే, ఫేస్ మాస్క్ తొలగించి.. నోటితో ఏదో చేశాడు. అది గాలి ఊదడం.. అని కొందరంటున్నారు. ఉమ్మివేశాడంటూ ఇంకొందరు అంటున్నారు. ఈ విషయమై షారుక్ ఖాన్ స్పందిస్తాడా.? లేదా.? అన్నది హాట్ టాపిక్ అయి కూర్చుంది.
సంప్రదాయ బద్ధంగా షారుక్ అలా ఊదాడనీ, ‘ఆత్మ శాంతించుగాక..’ అనే భావన ఆ చర్యలో వుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత.? అన్నది మాత్రం తేలాల్సి వుంది.
అయితే, పెద్దలను గౌరవించడంలో షారుక్ ఖాన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? పైగా, లతాజీ అంటే వివాదాలకు దూరం. ఆమె అందరికీ ఆత్మ బంధువే. షారుక్ సినిమాల్లో చాలా పాటలు పాడారు లతాజీ. అలా లతాజీ అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం షారుక్ ఖాన్‌కి వుంటాయి. సో, జరుగుతున్నదంతా కేవలం దుష్ప్రచారమే.