Poonam Kaur : అసలు పూనమ్ కౌర్ ఇదంతా ఎందుకు చేస్తోంది.?

Poonam Kaur

Poonam Kaur :  పూనమ్ కౌర్.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. అంత పాపులారిటీ పూనమ్ కౌర్ ఎలా దక్కించుకుందంటే, ఆమె చేసిన సినిమాల వల్ల కాదు.. ఆమె చుట్టూ వచ్చిన బోల్డన్ని వివాదాల కారణంగా. పాపం.. ఆమె ఏమీ చెయ్యలేదు.. కానీ, ఆమెను అలా అందరూ వివాదాల్లోకి లాగుతుంటారంతే.!

నిజమేనా.? పూనమ్ కౌర్ అస్సలు తప్పులేమీ చేయలేదా.? అంటే, ఎందుకు చేయలేదు.. చాలానే చేసేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుంది. అభిప్రాయాలు చెప్పడమే నేరమా.? అంటే, అసలు కథ వేరే వుంది.

పవన్ కళ్యాణ్ పేరు పరోక్షంగా ప్రస్తావనకు వచ్చేలా, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు గుర్తుకు వచ్చేలా.. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు పోస్ట్ చేయడం చాలాకాలంగా నడుస్తున్న వ్యవహారమే. ఈ క్రమంలోనే ఆమె పేరు మీడియాలో మార్మోగిపోతోంది.

కొన్నాళ్ళ క్రితం పూనమ్ కౌర్ పేరుతో ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. దాంతో, పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నం కొంతమంది చేసిన మాట వాస్తవం. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పూనమ్ కౌర్ పోలీసుల్ని కూడా ఆశ్రయించింది. ఆ ఫిర్యాదులపై పోలీసుల స్పందనేంటి.? అరెస్టులేమైనా జరిగాయా.? అన్నది వేరే చర్చ.

‘నన్ను (Poonam Kaur ) అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు. ఎవరి మీదనో కక్ష తీర్చుకోవడానికి తన పేరుని వాడుతున్నారు..’ అంటూ తాజాగా వాపోయింది పూనమ్ కౌర్. ఆ ట్వీట్లు.. ఆ కామెంట్లు.. వాటి ద్వారానే కదా ఇంత రచ్చా జరుగుతున్నది.!