Poonam Kaur : బావ సినిమా అంటూ పూనమ్ కౌర్ వాట్సాప్ చాట్ బయటపెట్టింది..ఇప్పుడే ఎందుకో?

Poonam Kaur

Poonam Kaur : ఇప్పుడు ఎందుకో మళ్ళీ టాలీవుడ్ కి చెందిన మరో కాంట్రవర్సియల్ హీరోయిన్ పూనమ్ కౌర్ గత కొన్ని రోజులు నుంచి సంచలనం రేపుతోంది. అయితే పూనమ్ కౌర్ అంటేనే టాలీవుడ్ ఆడియెన్స్ మొదటగా గుర్తొచ్చే హీరో కూడా ఎవరో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.

దీనితో అభిమానులతో పాటు పవన్ వ్యతిరేఖులు కూడా చాలానే ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూసారు. అయితే పూనమ్ పవన్ కి అనుకూలంగా మాట్లాడుతుందో అననుకూలంగా మాట్లాడుతుందో అర్ధం కాదు కానీ ఇప్పుడు అయితే పవన్ ని తన బావ అంటూ ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ని పెట్టి సంచలనం రేపింది.

ఎవరో భీమ్లా నాయక్ సినిమాకి వెళ్లడం దానికి ఈమె రిప్లై ఇవ్వడం సినిమా ఎవరిదీ అంటే అవతల వాళ్ళు అక్క బావ సినిమాకి వచ్చా అని చెప్పడం ఈమె టాక్ కూడా అడగడం చిన్నపాటి రచ్చే ఈ వాట్సాప్ చాట్ లో నడిచింది.

దీనికి మళ్ళీ ఒక లవ్ సింబల్ తో ఆమె షేర్ చెయ్యడం మరో హైలైట్. దీనితో ఈమె సరిగ్గా ఇప్పుడే ఎందుకు ఈ పోస్ట్ పెట్టాలి అంటూ నెటిజన్స్ సహా పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

https://twitter.com/poonamkaurlal/status/1497118037761458181?s=20&t=OGyl40EkCDwy9sfyc8pE1Q