Vijay and Ajith : తెలుగులో విజయ్, అజిత్ ఎందుకు ఫెయిలవుతున్నారు.?

Vijay and Ajith : తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విక్రమ్, విశాల్ తదితరులకి మంచి మార్కెట్ వుంది. అయితే, సినిమాలో కంటెంట్ వుంటేనే.. వీళ్ళ సినిమాలకు సరైన వసూళ్ళు దొరుకుతాయనుకోండి.. అది వేరే సంగతి. అయితే, అజిత్ అలాగే విజయ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం.

చాలాకాలంగా అజిత్, విజయ్.. పట్టు వదలని విక్రమార్కుల్లా తెలుగు ప్రేక్షకులపై దండయాత్ర చేస్తూనే వున్నారు. అజిత్ అప్పుడెప్పుడో ‘ప్రేమలేఖ’ సినిమాతో తెలుగునాట హిట్టు కొట్టాడు.. అదీ డబ్బింగ్ సినిమానే. అయితే, ఆ తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ అయితే తెలుగులో అజిత్‌కి లేదు.

తాజాగా ‘వాలిమై’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడుగానీ, బొక్కబోర్లా పడ్డాడు. నిజానికి, ‘వాలిమై’ సినిమాకి తెలుగులో మంచి బిగినింగ్ లభించాలి. ఎందుకంటే, మన తెలుగు హీరో కార్తికేయ ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు కాబట్టి.

అజిత్ సినిమా కాబట్టి తేడా కొట్టిందో.. లేదంటే, సినిమాలో కంటెంట్ లేక చతికిలపడిందో.. కారణమేదైతేనేం, ఇంకోసారి ‘వాలిమై’తో అజిత్ నిరాశచెందాల్సి వచ్చింది. ఈ సినిమాకి తెలుగు టైటిల్ పెట్టి వుంటే, కాస్త బెటర్‌గా తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేవారేమో.!