Nani Did Same : నాని మళ్లీ అదే ఓవరాక్షన్ చేశాడెందుకు.?

Nani Did Same :  ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమా టైమ్‌లో నాని కాస్త అత్యుత్సాహం చూపించిన సంగతి తెలిసిందే. అదేనండీ, సినిమా టిక్కెట్ల విషయంలో ఈ మధ్య పెద్ద రగడే నడిచిొంది కదా. పొలిటికల్‌గానూ హీటు పెంచింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో తనకు సంబంధం వుందా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే, ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
అయితే, నాని ఆవేదనలో అప్పుడు అర్ధం లేకపోలేదనుకోండి. సరే, ఆ విషయం పక్కన పెడితే, తాజాగా నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మొదలైన ప్రమోషన్లలో భాగంగా, నాని మరోసారి కెలుక్కున్నాడు.
ప్యాన్ ఇండియా అంటే ఏంటో తనకు తెలీదని వ్యాఖ్యానించాడు. అదేంటీ.? ప్యాన్ ఇండియా, ప్యాన్ ఇండియా అంటూ, సరికొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి ఇప్పుడు అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ‘ప్యాన్ ఇండియా అంటే నాకు తెలీదు..’ అని నాని ఎలా వ్యాఖ్యానిస్తాడు.?
అంతేకాదు, ఇటీవల రిలీజైన నాని ‘శ్యామ్ సింఘరాయ్’ కూడా ప్యాన్ ఇండియా సినిమా లిస్టులోనే చేరుతుంది. తెలుగుతో పాటు రకరకాల భాషల్లో రిలీజైంది ఆ సినిమా. అయితే వర్కవుట్ కాలేదంతే. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా కూడా వివిధ భాషల్లో రిలీజవుతోంది.
మరి, నాని ఎందుకలా అన్నాడబ్బా.? కావాలని కెలుక్కుంటూ, కొత్త రకం పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టాడా.. ఏంటీ.? నాని.. అంటూ విమర్శలు తలెత్తుతున్నాయ్. కెలుక్కుంటున్నాడు సరే, ఈ కొత్త పబ్లిసిటీతో నాని సాధించేదేముందటా.! ఆల్రెడీ ‘శ్యామ్ సింఘరాయ్’ హిట్టు తర్వాత వస్తున్న నాని సినిమా కావడంతో ‘అంటే సుందరానికి’ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. ఆ అంచనాల్ని అందుకోగలదో లేదో చూడాలి మరి.