అతిలోక సుందరి కుమార్తై జాన్వీకపూర్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే, శ్రీదేవి కూతురుగా జాన్వీ పేరు టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే, సౌత్‌లో మార్మోగిపోయింది. కానీ, బ్యాడ్ లక్.. ఆమె హీరోయిన్ కాకముందే, తల్లి శ్రీదేవి అర్ధాంతరంగా చనిపోవడం..
ఆ పై జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్‌గా అంతంత మాత్రం అవకాశాలు దక్కించుకోవడం.. జరుగుతోంది.
శ్రీదేవి మీదున్న అపారమైన అభిమానంతో తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం ఆడియన్స్ కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఈ లోపు జాన్వీ వ్యాఖ్యలు తెలుగు ఆడియన్స్‌ని బాధపెట్టాయి. అంతేకాదు, తెలుగు సినిమాని అవమానించేలా జాన్వీ మాటలున్నాయి.
అసలు విషయమేంటంటే, తెలుగులో ఇంతవరకూ జాన్వీని ఇంప్రెస్ చేసేలా, టెంప్ట్ చేసేలా కథ దొరకలేదట. అదీ విషయం. అదేంటీ.. తెలుగు సినిమాలనే బాలీవుడ్‌లో రీమేకుల మీద రీమేకులు చేసుకుంటున్నారు స్టార్ హీరోలు సైతం. అలాంటిది తనను ఇంప్రెస్ చేసే తెలుగు కథే దొరకలేదంటూ జాన్వీ పలకడం తెలుగు సినిమానీ, సౌత్ సినిమానీ దారుణంగా అవమానించినట్లేగా.. అంటూ నెటిజనం వాపోతున్నారు.