Janasenani : టీడీపీ ప్రేమబాణాలపై జనసేనాని మౌనమెందుకు.?

Janasenani : తెలుగుదేశం పార్టీ ప్రేమ బాణాలు సంధిస్తోంది.. జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు వాటిని తిప్పి కొడుతున్నారు. అయితే, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రేమ బాణాల్ని సంధించిన దరిమిలా, ఈ ప్రేమబాణాల వ్యవహారంపై నేరుగా స్పందించాల్సింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే.

జనసేన పార్టీకి ఫలానా నియోజకవర్గాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారంటూ టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం షురూ చేసింది. తద్వారా టీడీపీకి జనసేన బీ-టీమ్.. అనే సంకేతాల్ని టీడీపీ అను’కుల’ మీడియా పంపగలుగుతోంది ప్రజల్లోకి.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీది దుష్ప్రచారమో, లేదంటే.. టీడీపీ బాణాలకు జనసేన సానుకూలంగా స్పందిస్తుందో.. నిక్కచ్చిగా చెప్పాల్సిన బాధ్యత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదనే వుంది. ఆలస్యం అమృతం విషం.. అన్నట్టు, ఇలాంటి సందర్భాల్లో జనసేనాని వివరణ ఆలస్యమయ్యేకొద్దీ, జనసేన శ్రేణులూ అయోమయానికి గురవుతాయి.. అది జనసేన పార్టీకి చేటు చేస్తుంది.

జనసేనాని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో కూడా టీడీపీనే నిర్ణయించేసిందట.. అన్న వాదన సర్వత్రా వినిపిస్తోందంటే, టీడీపీ అను’కుల’ మీడియా చేసే దుష్ప్రచారం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి అధికార వైసీపీ నుంచి జనసేనకు ‘ముప్పు’ తక్కువే వుండొచ్చు.. అత్యంత ప్రమాదకరమైన రాజకీయం తెలుగుదేశం పార్టీ నుంచే జనసేన వైపుకు పొంచి వుంటుంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ‘అన్నీ ఆలోచించే రాజకీయ పార్టీ పెట్టాను..’ అని బలంగా చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయాల పట్ల ఎందుకు అప్రమత్తమవలేకపోతున్నారు.?

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles