క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటి సురేఖ వాణి. అక్క, అమ్మ, వదిన, చెల్లి వంటి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా కాదు. ఇలా ఇద్దరూ కొట్టి బట్టల దర్శనమిస్తూ.. డాన్సులు చేస్తూ సందడి చేస్తుంటారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.
సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు , పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తున్న ప్రతీ విషయాన్ని నెటిజన్స్ తో షేర్ చేస్తోంది. అంతేకాకుండా తన తల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి మీద విరుచుకుపడుతుంది. అయితే సుప్రిత హాఫ్ నాలెడ్జ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటి వాటిని నెటిజన్లు బాగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసేవారు. వాటిపై సుప్రిత కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతుండేది. ఇక తమ మీద వచ్చే రూమర్లను మాత్రం సుప్రిత తీవ్రస్థాయిలో తిప్పి కొట్టేది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత అప్పుడప్పుడు నెటిజన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ అమ్మడికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఒక నేటిజన్ సుప్రీతని ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. మీరు ఎందుకు ఇంకా సింగిల్ గానే ఉన్నారు? అని ప్రశ్న అడిగాడు. దానికి సుప్రీత రియాక్ట్ అవుతూ..సింగిల్‌గా ఉండటమే క్రేజీగా చాలా క్రేజీ గా ఉంటుంది. అంతే కాకుండా..తిన్నావా? బుజ్జి, బంగారం.. చిట్టి , కుట్టి అనే మెసెజ్‌లు చేయడం నాకు చిరాగ్గా ఉంటుంది అని మరొక సమాధానం చెప్పింది.