మంచు విష్ణు అంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడు?

ఇప్పటివరకు దాదాపు ఇరవై సినిమాలు చేసినా కానీ మంచు విష్ణు కి హీరో గా సరైన గుర్తింపు రాలేదు. ‘ధీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనైకైనా రెడీ’ లాంటి కొన్ని హిట్స్ ఉన్న కానీ, అవి సూపర్ హిట్స్ కావు. చాలా ఇంటర్వూస్ లో విష్ణు తనను తాను ఏదో పెద్ద స్టార్ ని అనుకుని, అలాగే తన ఫాదర్ పేరు వాడుకుని ఉంటే ఇప్పటికి ఇండియాలోనే అతి పెద్ద స్టార్ హీరో ని అయ్యేవాడినని అని ట్రోల్ల్స్ కి దొరికిపోయాడు.

విష్ణు గత సినిమా ‘మోసగాళ్లు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, కనీసం రిలీజ్ అయినట్టు కూడా తెలియకుండా పోయింది. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా విష్ణు సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు.

ఇప్పుడు తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు దసరా పండగకి అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానున్నాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది.

ఇషాన్ సూర్య దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోస్ కో పోటీగా నిలబడి మంచు విష్ణు హిట్ కొట్టగలడా అని చాలా మంది అనుమానపడుతున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి హీరోస్ కే ఓపెనింగ్స్ అంతంత మాత్రం వస్తుంటే…విష్ణు సినిమా కి కనీసం థియేటర్స్ అయినా దొరుకుతాయా అని చాలా మంది డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు.