Devotional Tips: పూజ అనంతరం ధూపం ఎందుకు వేస్తారు… ధూపం వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. ఇలా ప్రతి రోజు దీపారాధన చేయటం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తారు. ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్ట దైవాన్ని ఆరాధించేవారు. అయితే పూజ చేసిన తరువాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయడం మనం చూస్తూ ఉంటాము. ఇలా కొందరు సాంబ్రాణి ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తుంటారు.అయితే ఇలా దూపం ఎందుకు వేయాలి వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరం, లవంగం ధూపం వేస్తారు. ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు తొలగిపోయి ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేస్తారు.

చాలామంది గుగ్గిలం ధూపం వేస్తారు.ఇలా గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇల్లు మొత్తం సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇలాంటి ధూపం వేయడం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. దీంతో ఏ విధమైనటువంటి గొడవలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయడం ఆనవాయితీగా పాటిస్తారు.