చంద్రబాబుకు చిరంజీవి అంటే ఎందుకంత భయం?? మళ్ళీ చిరును బాబు టార్గెట్ చేశారా!!

cbn

చిరంజీవికి సినిమాల్లో ఎదురు లేదు. ఆయనకు సినిమాల్లో నీరాజనం పట్టిన రాజకీయాల్లో మాత్రం ప్రజలు చిరంజీవిని పట్టించుకోలేదు. చిరంజీవిని రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చిరంజీవిని దెబ్బతియ్యడానికి అప్పట్లో చాలా వ్యూహాలను రచించారు. చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వెయ్యడానికి బాబు అప్పట్లో తనకున్న అనుకూల మీడియాతో చాలా పథకాలు రచించారు. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలను వదిలి, సినిమాల్లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్ళీ బాబు చిరును దెబ్బతియ్యడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

The BJP is in talks with Chiranjeevi
The BJP is in talks with Chiranjeevi

చిరు రాజకీయాల్లోకి వస్తారా!!

చిరంజీవి నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా. ? లేదా.? అన్న అంశానికి సంబంధించి స్పష్టత కోసం వేగుల్ని కూడా టీడీపీ నియమించిందట. చిరంజీవిని దువ్వుతున్న బీజేపీ అగ్రనేతలెవరన్నదానిపై ఇప్పటికే చంద్రబాబు వద్ద పూర్తి సమాచారం వుందట. చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ వస్తున్నారనే వార్తలు రావడంతో బాబుకు భయం పట్టుకుంది. ఆ భయంతో గతంలో చిరుపై వేసిన వ్యూహాలను మళ్ళీ వెయ్యడానికి బాబు, బాబు అనుకూల మీడియా సిద్ధంగా ఉంది.

బాబు చిరును టార్గెట్ చేశారా!!

ఒక అన్నగా చిరంజీవి తనకు ఎప్పుడూ మద్దతిస్తూనే ఉంటాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలు రావడంతో పతనానికి చేరువలో ఉన్న బాబుకు మళ్ళీ జనసేన రూపంలో పోటీ వస్తుందని భయపడుతున్నారు. ఈ భయంతో బాబు ఇప్పుడు మళ్ళీ చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వెయ్యడానికి మళ్ళీ అనుకూల మీడియాతో వ్యూహాలు రచిస్తున్నారు. బాబుకు రాజకీయాల్లో ఎవరినైనా తన కోసం వాడుకోవడం తెలుసు, అవసరం తీరిన తరువాత వాళ్లనే వెన్నుపోటు పొడచడం అలవాటు. అలాగే ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ ను కూడా దెబ్బతియ్యడానికి బాబు వ్యూహాలు రచిస్తున్నారు.