Balayya Took Sri Reddy Very Lite : శ్రీరెడ్డిని బాలయ్య ఎందుకు పక్కన పడేశాడో.!

Balayya Took Sri Reddy Very Lite

Balayya Took Sri Reddy Very Lite :  శ్రీరెడ్డి.. ఈ పేరు తలిస్తేనే రకరకాల వైబ్రేషన్స్ (వేరే టైపులో లెండి). ఈమెను తెరపై నటి అనాలో, పబ్లిక్ నటి అనాలో కూడా తెలియని దుస్థితి. అంతలా నటించేస్తుంటుంది మరి రియల్ లైఫ్‌లో ఈమె. అప్పుడెప్పుడో కాస్టింగ్ కౌచ్ అంటూ ఈవిడ గారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

టెలివిజన్ టీఆర్‌పీ రేటింగుల కోసం కొన్ని న్యూస్ ఛానెళ్లు ఈవిడగారిని తెగ పెంచి పోషించేశారు. అది చూసుకుని అమ్మడు అబ్బో ఓ రేంజులో రెచ్చిపోవడం అందరికీ తెలిసిందే. అలా వచ్చిన పబ్లిసిటీతో ఇంకేముంది నేనో పెద్ద హీరోయిన్‌ని అని ఫీలయిపోతూ తెగ బిల్డప్పులు ఇచ్చేసిందీ ప్రబుద్ధురాలు. ( Balayya Took Sri Reddy Very Lite )

ఇంకేముంది తన టాలెంట్ (ఓవర్ పబ్లిసిటీ టాలెంట్ అనుకోవాలేమో) చూసి ఏకంగా బాలయ్య బాబు పిలిచి మరీ అవకాశమిచ్చేశాడంటూ చెప్పుకుంది. అవునేమో కూడా. అప్పట్లో బాలయ్య బాబుతో డైరెక్టర్ తేజ ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. అదేనండీ ఎన్టీఆర్ బయోపిక్.

ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడం, క్రిష్ చేతుల్లోకి ఆ ప్రాజెక్టు రావడం, ఎలాగో కిందా మీదా పడి సినిమా తెరకెక్కడం, రిలీజ్ తర్వాత బొక్క బోర్లా పడడం అన్నీఅందరికీ తెలిసినవే. అయితే, ఈ బయోపిక్ తేజ చేతుల్లో వున్నప్పుడే మనం పైన చెప్పుకున్న ‘ఛీ రెడ్డి’.. సారీ సారీ శ్రీ రెడ్డికి ఛాన్స్ వచ్చిందటలెండి.

నిజంగానే తేజ ఛాన్సిస్తానన్నాడట కూడా. అయితే, తెర వెనుక శ్రీ రెడ్డి చాలానే ఓవరాక్షన్ చేసిందట. ఆ ఓవరాక్షన్ ఎపిసోడ్ మన బాలయ్యబాబు దృష్టికి వెళ్లడంతో శ్రీ రెడ్డికి దబ్బిడి దిబ్బిడి అయిపోయిందట. రాక రాక వచ్చిన ఛాన్స్ కాస్తా అలా హుష్ కాకి అయిపోయిందని ఫిలిం వర్గాల్లో ఓ టాక్.