దుబ్బాకలో సానుభూతి ఎవరి వైపు

solipet sujatha cheruku srinivas reddy t

 దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి అనేది కీ రోల్ పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్థానిక తెరాస పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవటంతో ఆయన భార్య సుజాతను బరిలో దించారు. కాబట్టి ఆమెకు సానుభూతి రావటం సహజం, అదే సమయంలో కాంగ్రెస్ తరుపున పోటీచేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కూడా అదే స్థాయిలో సానుభూతి రావటం అనేది విశేషం. గతంలో దుబ్బాక అంటే చెరుకు ముత్యంరెడ్డి అనే స్థాయిలో ఉండేది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం.

chruku mutyam reddy telugu rajyam

 

   దుబ్బాక నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలు చేసిన ఘనత ఆయన సొంతం. వివాద రహితుడు,సౌమ్యుడు అనే పేరుంది ఆయనకు. దుబ్బాక పరిధిలో పెద్దాయన అనే గౌరవం ఇస్తారు అందరు. ఇప్పుడు ఆయన వారసుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీచేయటంతో సహజంగానే పెద్దాయన మీద ఉన్న గౌరవం, ప్రేమ సానుభూతి రూపంలో ఓట్లు పడేలా చేయవచ్చు. పైగా గత కొన్నేళ్ల నుండి తెరాసలో ఉంటున్న కానీ, సరైన గౌరవం చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి దక్కలేదని, చివరి దాక తెరాస టిక్కెట్ కోసం పోరాడిన కానీ, టిక్కెట్ ఇవ్వటానికి నిరాకరించి, అవమానకరంగా పార్టీ నుండి బయటకు పంపారు అనే అభిప్రాయం స్థానిక ప్రజానీకంలో కనిపిస్తుంది.

 ఈ కోణం కూడా సానుభూతి రూపంలో శ్రీనివాస్ రెడ్డి కి లాభం చేకూర్చే అవకాశం ఉంది. అటు సోలిపేట సుజాత కు కావచ్చు, ఇటు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కావచ్చు సానుభూతి ఓట్లు అనేవి ప్రధానం. అందుకే తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలు ఆ దిశగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సమయంలో బీజేపీ నేత రఘునందన్ మాత్రం ఏడుపులు చూసి, పాతకాలపు గొప్ప విని మాత్రం ఓట్లు వేయకండి,దేశ వ్యాప్తంగా జరుగుతున్నా అభివృద్ధి చూడండి, బలమైన బీజేపీ నాయకత్వాన్ని చూసి ఓట్లేయండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి ఈ త్రిముఖ పోటీలో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి..