Big Boss Elimination: టాప్ 5 లో ఫినాలే కి చేరుకునేది ఎవరు..? ఈ వారం ఈ ముగ్గురికి ఎలిమినేషన్ తప్పదా..?

Big Boss Elimination: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఫినాలేకి చేరువలో ఉంది. ఇప్పటికే ఈ సీజన్ 10 వారాలు పూర్తి చేసుకొని 11 వ వారంలో కొనసాగుతోంది. ప్రతి వారం జరిగే నామినేషన్ కోసం ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ వారం ఒక కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేసేవారు. కానీ ఈ వారంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక్కో కంటెస్టెంట్ ముగ్గురిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఎప్పటినుండో ఈ సారి బిగ్ బాస్ లో టాప్5 కాకుండ టాప్6 కొనసాగుతారనే వార్తలకు బ్రేక్ పడింది. అనూహ్యంగా ఈ వారంలో ఒక్కొక్కరు ముగ్గురిని నామినేట్ చేయటంతో ఈ వారం ట్రిపుల్ ఎలిమినేషన్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్ లు ఉండగా వారిలో ఇప్పటికే అరీయానా, నటరాజ్ మాస్టర్, అనిల్ నామినేట్ అయ్యారు. వారాంతరనికి మిగిలిన వారిలో నలుగురు నామినేట్ అయినా కూడ డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురు కచ్చితంగా ఈ వారంలో ఎలిమినేట్ అవుతారనీ సమచారం . దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలని నటరాజ్ మాస్టర్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నామినేషన్ వల్ల బిందూ మీద నటరాజ్ మాష్టర్ మాటలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆయన ప్రవర్తనకు ప్రేక్షకులూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ వారం నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉండటం ఖాయం.

ఆరియాన గత కొన్ని రోజులుగా నామినేట్ అవుతునే ఉంది. ఈ వారం కూడ అరియనా, అనిల్ ఇద్దరు కూడ డేంజర్ జోన్ లో ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మిత్రా, బాబా భాస్కర్ మాష్టర్ కి మంచి ఓట్లు రావటంతో వారూ కూడ సేఫ్ లో జోన్లో ఉంటారని వార్తలు . అందువల్ల అఖిల్, బిందు, శివ , బాబా భాస్కర్ మాస్టర్, మిత్రా టాప్ 5 లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఈ రోజు సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే.