BigBoss Nonstop: టాప్ 5 లో ఉండేది ఎవరు..? టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే డిసైడ్ అయ్యిందా..?

BigBoss Nonstop: ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో మొదట్లో ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ గ్రాండ్ ఫినాలేకి చేరువలో ఉన్న సమయంలో ప్రతి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాన్-స్టాప్ రియాలిటీ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు కొనసాగుతున్నారు. గడిచిన వారం ఆశు రెడ్డి ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ మాస్టర్, నట్రాజ్ మాస్టర్, అఖిల్, అనిల్, శివ, బిందు మాధవి, మిత్ర శర్మ, అరియానా కొనసాగుతున్నారు.

అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ వారం నామినేషన్లు చాలా రసవత్తరంగా జరిగాయి. ఈ వారంలో కంటెస్టెంట్ ల ఆట తీరు చాలా మారిపోయింది. గ్రాండ్ ఫినాలే కు చేరువ అవుతుండటంతో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ టైటిల్ కోసం పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ముగ్గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయితే హౌజ్ లో 5 మంది మాత్రమే ఉంటారు. వారూ మాత్రమే ఫినాలే కి చేరుకుంటారు. అయితే ఇపుడు టాప్ 5 కి చేరుకునే వారూ ఎవరు అంటూ సోషియల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అయితే టాప్ 5 కి వెళ్ళటానికి నటరాజ్ మాస్టర్, అఖిల్, బిందూ, బాబా భాస్కర్ మాస్టర్, శివ లేదా మిత్ర వీరు ఇద్దరిలో ఒకరు టాప్ 5 లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టైటిల్ విన్నర్ విషయానికీ వస్థే ఎవరికి వారు విజేతలుగా భావించుకుంటున్నారు. మొదటి నుండి ఈ సారి టైటిల్ విన్నర్ తానే అని అఖిల్ చాలా ధీమాగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్ టైటిల్ విన్నర్ కచ్చితంగా లేడీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఆడ పులిగా బిందు మాధవి కూడా టైటిల్ రేస్ లో నిలిచి గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఎంతో ఉత్కంఠగా సాగే ఈ సీజన్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.