టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ విషయంలో బెస్ట్ స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఇండస్ట్రీలో పేరుంది. రెండు దశాబ్దాల క్రితం వరకు టాలీవుడ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపించేది. ఇప్పుడు మాత్రం ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, బన్నీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు డ్యాన్స్ విషయంలో మెప్పిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఈ ఇద్దరు హీరోలలో నంబర్ 1 హీరో ఎవరనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది డ్యాన్స్ విషయంలో బన్నీ గ్రేట్ అని చెబుతుంటే మరి కొందరు తారక్ నంబర్1 అని చెబుతున్నారు. రామ్ చరణ్, రామ్, నితిన్ మరి కొందరు హీరోలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నా ఎన్టీఆర్, బన్నీ స్థాయిలో వీళ్ల డ్యాన్స్ లకు ప్రశంసలు దక్కడం లేదు. గత కొన్నేళ్ల నుంచి బన్నీ డ్యాన్స్ పై మరింత శ్రద్ధ పెడుతున్నారు.

ప్రతి సినిమాలో తన డ్యాన్స్ లకు మరింత ఎక్కువగా ప్రాధాన్యత ఉండేలా బన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రం పాటకు అవసరమైతే మాత్రమే డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. బన్నీ ఎంతో కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఎన్టీఆర్ మాత్రం ప్రాక్టీస్ చేయకుండానే స్టెప్పులు అద్భుతంగా వేసి ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు. యమదొంగ, కంత్రీ సినిమాలోని సాంగ్స్ తారక్ కు డ్యాన్సర్ గా మరింత ప్రశంసలు దక్కుతున్నాయి.

డ్యాన్స్ విషయంలో బన్నీ, తారక్ లలో ఒకరు ఎక్కువా ఒకరు తక్కువ కాదని ఈ ఇద్దరూ సమానమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ కూడా డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నా స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. కొందరు టాలెంటెడ్ హీరోలు డ్యాన్స్ లు బాగానే ఉన్నా ఈ హీరోలకు ప్రేక్షకుల్లో తగిన గుర్తింపు లేకపోవడం మైనస్ అవుతోందని సమాచారం.