Hero Nani: ప్రెస్‌తో మాట్లాడుతుంటే హీరో నాని వెనక్కి లాగి అలా మాట్లాడారు…. సీనియర్ ఆర్టిస్ట్ కోటేశ్వరరావు!

Hero Nani: భీమిలీ కబడ్డీ జట్టు సినిమాను తీసుకుంటే అది కమర్షియల్ సినిమా కాకపోయినా, మంచి మూవీగా నిలిచిపోయిందని ఆర్టిస్ట్ మానవ కోటేశ్వర రావు తెలిపారు. ఆ సినిమాలో హీరో నాని గారికి యజమానిగా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మూవీ చేయడం తనకు నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఇకపోతే ఆ సినిమా చిత్రీకరణ పాలకొల్లులో జరిగిందని, ఇక్కడ అయితే పోచంపల్లిలో తీశామని ఆయన చెప్పారు.

ఇక నాని గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కిందిస్థాయి నుంచి పైకొచ్చిన వ్యక్తి అని ఆయన అన్నారు. పంచె కట్టుకొని కింద కూర్చుంటుంటే, మీరు కూర్చోవద్దని చెప్పి ఆయన కుర్చీని తనకు ఇచ్చేవారని ఆయన తెలిపారు. ఒకసారి లోకల్ ప్రెస్ వాళ్లు వచ్చి. తన పేరు అడిగితే కోటేశ్ మానవ అని చెప్పానని ఆయన తెలిపారు. దానికి వాళ్లు అదేంటండీ అని అడిగితే, దానికి సమాధానంగా ఆయన ఈ విధంగా చెప్పారట. నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్లు షయాజీ షిండే, ముకేష్ రిషి అలా అని రెండూ ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాననంటూ చెప్తుంటే.. సరదాగా నాని గారు చేయి పట్టుకొని లాగి, అలా చెప్పకూడదండీ ఊరుకోండి.. ప్రెస్‌వాళ్లు ఏది పడితే అది రాసేస్తారు అని అనగానే సరదాగా అన్నానండీ ఇది రాయకండి అని వాళ్లకు చెప్పినట్టు ఆయన వివరించారు. ఇక తర్వాత మళ్లీ ఆయనతో కలిసి నటించలేదని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా తనకు ఇన్స్‌ఫిరేషన్ దాసరి గారు అని, ఆయన 1975-80 మధ్యలో తీసిన సినిమాలు తాను ఇప్పటికీ చూస్తూ ఉంటానని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాల్లోని డైలాగ్‌లు.. ముఖ్యంగా అయితే లొకేషన్‌లు చాలా బాగా ఉంటాయని అవన్నీ కూడా చెన్నై, హైదరాబాద్‌లో తీశారని, కానీ ఇప్పుడు అలాంటి లొకేషన్‌లు మళ్లీ కనిపించవని ఆయన అన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే తాను డైరక్టర్‌ అవ్వాలనే కాంక్షతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని కోటేశ్వర రావు స్పష్టం చేశారు.