RRR & KGF: కేజిఎఫ్ , ఆర్ఆర్ఆర్ సినిమాలలో ఎవరిది పై చేయి…?

RRR & KGF: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో చాలా ప్రతిష్టాత్మకంగా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన ప్రముఖ టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండియా హీరోలుగా బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనకి అన్ని భాషల ప్రజలు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలైన మూడు వారాల వ్యవధిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది.

కేజిఎఫ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ హీరో యశ్ నటించాడు. ఎస్ ఈ సినిమాలో రాఖీ బాయ్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలు కలెక్షన్ల విషయంలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించగా కేజీఎఫ్2 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కలెక్షన్ల విషయంలో కేజీఎఫ్2 పైచేయి సాధించింది.

ఇక ప్రశంసల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ ముందువరసలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.రాటెస్ టొమాటోస్ లో స్థానం సంపాదించుకున్న తొలి సినిమా ఆర్ఆర్ఆర్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూసి హాలీవుడ్ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు . కేజీఎఫ్2 సినిమా కూడా ఓటీటీలో అవుతున్నా కూడా ఈ సినిమాకు ఆ స్థాయిలో గుర్తింపు లభించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీ పైచేయి సాధించింది.