‘ఇస్లాం’ ఐక్యత, హిందూ సమాజంలో ఎక్కడ.?

బీజేపీ అధికార ప్రతినిథి, మహిళా నేత నుపుర్ శర్మ, ఇస్లాం మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో బీజేపీ నేత, ఆ వ్యాఖ్యల్ని సమర్థించారు. ఇద్దరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు దేశం దాటి, ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని పలచనయ్యేలా చేశాయి.

దేశంలో రాజకీయం ఎలా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. మన రాజకీయ పార్టీలు, మన మీడియా.. కొంచెమైనా మన దేశం పరువు పోతుందేమోనని ఆలోచించాయా.? లేదే.! రాజకీయ పార్టీలు మీడియాని శాసిస్తున్న దరిమిలా, ఇదిగో ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తాయి.

హిందూ సమాజంపై, చాలా ఏళ్ళుగా దాడి జరుగుతోంది. ఏ మతంలోనూ మత మార్పిడులు వుండవు.. కేవలం హిందూ మతానికే ఆ జాడ్యం పట్టింది. ఆ జాడ్యాన్ని హిందూ మతానికి పట్టించిందెవరు.? ఈ విషయమై ఏ రాజకీయ పార్టీ కూడా పెదవి విప్పదు. ఎందుకంటే, ఓటు బ్యాంకు రాజకీయం.

అన్ని మతాల ఓటు బ్యాంకూ రాజకీయ పార్టీలకు అవసరం. హిందూ సమాజం మాత్రం, ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మేయాలి.! హిందూ దేవాలయాల్లో టిక్కెట్ల ధరలు ఎందుకు.? అన్న ప్రశ్న ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా రాదు. ఎందుకు.? అదంతే. హిందూ మతంపై జరుగుతున్న దాడికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్. ఏ మీడియా కూడా హిందూ మతానికి జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పదు. అదే, ఇతర మతాల విషయంలో అయితే, ప్రపంచం దృష్టిలో దేశం పరువుని బజారుకీడ్చేసేలా కథనాల్ని ప్రసారం చేస్తాయ్ ఆయా మీడియా సంస్థలు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.!