Samantha: నిశ్చితార్థపు ఉంగరాన్ని సమంత ఏం చేశారో తెలుసా…అలా మార్చేసిందా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి కెరియర్ పరంగా ఇండస్ట్రీపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయనతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ వీరి విడాకుల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల నాగచైతన్య సైతం చాలా సీరియస్ గా ఖండించారు. మా విడాకులు అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయ్యాయి అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు.

ఇలా నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని విలువైన వస్తువులను తిరిగి అక్కినేని కుటుంబానికి వెనక్కి పంపించినట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా సమంత నిశ్చితార్థపు ఉంగరానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. సమంత నాగచైతన్య నిశ్చితార్థపు సమయంలో ఆమెకు నాగచైతన్య మూడు క్యారెట్ల ప్రిన్సెస్ కట్ ఒక డైమండ్ రింగును తన వేలికి తొడిగారు. పెళ్లి తర్వాత చాలా సందర్భాలలో సమంత ఇదే ఉంగరంతో కనిపించారు.

ఇటీవల కాలంలో సమంత చేతికి ఆ ఉంగరం లేకపోవడంతో సమంత తన నిచ్చితార్థపు ఉంగరాన్ని ఏం చేసింది అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి అయితే సమంత తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ఒక పెండెంట్గా మార్చి మెడలో అప్పుడప్పుడు వేసుకోవడం మనం చూడొచ్చు అయితే సమంత తన పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి ఉండకుండా వాటన్నింటినీ కూడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే.

తన పెళ్లిలో వేసుకున్న వైట్ కలర్ డ్రెస్సులో కూడా పూర్తిగా ఈమె బ్లాక్ కలర్ డ్రెస్ లాగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఇలా తన పెళ్లికి సంబంధించిన ఏ జ్ఞాపకాలు తన వద్ద ఉండకూడదని సమంత ప్రయత్నిస్తున్నారు అయితే తన భర్త పై ఉన్న ప్రేమతో నాగచైతన్య పేరును ఈమె నడుము పై భాగాన టాటూ వేయించుకున్నారు కానీ ఆ టాటూను మాత్రం తొలగించుకోలేకపోతున్నారని చెప్పాలి.