Aamani: హీరోయిన్ ఆమని గారి ఇంటి నుంచి తానొక హీరోయిన్‌గా పరిచయం కావడం నిజంగా తనకు చాలా గర్వంగా ఉందని ఆమని మేన కోడలు, యువ కథానాయిక హిృతికా శ్రీనివాస్ అన్నారు. తాను తన అత్త ఆమని నటించిన సినిమాలన్నీ చూస్తానని, అవి చూస్తూనే పెరిగానని, అందుకే ఆమెనే ఆదర్శంగా తీసుకొని తాను కూడా ఆమెలా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు ఆమె తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి వస్తాను అనగానే తన అత్త ఆమని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే తాను ఎప్పుడూ సినిమాల్లో నటిస్తానన్నట్టు చెప్పలేదని ఆమె అన్నారు. తాను సడన్‌గా ఓ రోజు తన తండ్రితో నేను సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నిస్తానని చెప్పినపుడు ఆయనతో పాటు, ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోయారని ఆమె చెప్పారు. ఆ తర్వాత అందరూ ఓకే చెప్పారని ఆమె అన్నారు.
కాగా తనకు హీరోయిన్‌గా ప్రయత్నించడనికి, ఆ తర్వాత కూడా ఆమని బాగా సపోర్ట్ చేశారన్న హిృతికా, ప్రతీ విషయంలోనూ ఎలా ఉండాలీ, ఎలా ఉండకూడదు అనే విషయాలు చెప్తూ ఉంటారని ఆమె తెలిపారు. మేకప్ దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ చాలా టిప్స్ కూడా ఇస్తూ ఉంటారని ఆమె అన్నారు. ఇప్పుడు కూడా తనకు ఏదైనా తెలియకపోతే, ఏం చేయాలో పాలుపోకపోతే తనకే ఫోన్ చేస్తానని ఆమె చెప్పారు.
ఇకపోతే తాను ఇటీవల హీరోయిన్‌గా నటిస్తున్న అల్లంత దూరాన చిత్రంలో ఆమని కూడా నటిస్తున్నారని ఆమె తెలిపారు. అలా తనతో కలిసి నటిస్తున్నపుడు ప్రారంభంలో కొంచెం నెర్వస్‌గా అనిపించినా తన అత్త సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా అనిపించేదని ఆమె తెలిపారు. నిజంగా చెప్పాలంటే ఆమెతో నటించడం అనేది తనకు వచ్చిన ఓ గొప్ప అవకాశంగా భావిస్తానని హిృతికా స్పష్టం చేశారు.