Vasantha Panchami: వసంత పంచమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది… వసంత పంచమి రోజు ఏం చేయాలో తెలుసా?

Vasantha Panchami: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల ఎన్నో ముఖ్యమైన రోజులు ,పండుగలు వస్తాయి. ఈ క్రమంలోనే వసంత పంచమిని ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. ఈ వసంత పంచమి హిందువులు సిక్కులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజుతో చలికాలానికి స్వస్తి పలుకుతూ వసంత రుతువుకు ఆహ్వానం పలుకుతుంది. వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షంలో ఐదవ రోజున వస్తుంది. కనుక ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వసంత పంచమి వచ్చింది.

హిందూ పురాణాల ప్రకారం వసంత పంచమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. అలాగే ఈ వసంత పంచమి రోజు ముఖ్యంగా సరస్వతీదేవిని పెద్దఎత్తున పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల వారి పిల్లలకు సకల జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు. అందుకోసమే ఈ వసంతపంచమి రోజు పెద్ద ఎత్తున పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహిస్తారు.అదేవిధంగా ఈ వసంత పంచమి రోజు ఎంతో మంది తల్లిదండ్రులు వారి చిన్నారులకు విద్యాభ్యాసాన్ని నిర్వహిస్తారు.

ఈ వసంత పంచమి రోజు తెలంగాణలోని బాసర సరస్వతి దేవి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి పిల్లలకు విద్యాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. వివాహ కార్యక్రమాలకు లేదా నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి,నూతన గృహప్రవేశం చేయడానికి వసంత పంచమి రోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు కనుక ఈ రోజు పెద్ద ఎత్తున శుభ కార్యాలను కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా వసంత పంచమిని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ జరుపుకోనున్నారు.