Comedy Stars: బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇస్తే కాంట్రవర్సీలు వస్తాయ్: ఎక్స్ ప్రెస్ హరి

Comedy Stars:బుల్లితెరపై ఎన్నో కామెడీ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం తరహాలో స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎక్స్ ప్రెస్ హరి బండ్ల గణేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు.ఈ క్రమంలోనే ఎక్స్ ప్రెస్ హరి బండ్ల గణేష్ పై స్కిట్ చేసి అందర్నీ నవ్వించారు.ఈ క్రమంలోనే ఒక అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ వచ్చిన ఎక్స్ ప్రెస్ హరి మాట్లాడుతూ.. పెళ్లయిన మగాడితో జీవితం బండ్ల గణేష్ గారు మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూ లాంటిది. ఎంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ ఇద్దామన్నా ఎక్కడో ఒకచోట ఫ్రస్టేషన్ వస్తుందంటూ తన పై పంచ్ వేసాడు.

అదే విధంగా తన టీం మెంబర్ ఒకరు వచ్చి నాగబాబును డాడీ అనే ఉద్దేశిస్తూ…అన్న డాడీ పక్కన కూర్చున్న అతను ఎవరు అంటూ బండ్ల గణేష్ ని చూపిస్తూ అడుగుతారు. అతను బండ్ల గణేష్ సినిమా ప్రొడ్యూసర్. ఆయన సినిమాలు చేస్తే కలెక్షన్లు వస్తాయని ఎక్స్ ప్రెస్ హరి చెప్పగా వెంటనే మరొక వ్యక్తి ఇంటర్వ్యూలు ఇస్తే అని అడగగా వెంటనే ఎక్స్ ప్రెస్ హరి కాంట్రవర్సీలు వస్తాయి అంటూ బండ్ల గణేష్ గురించి మరోసారి పంచ్ వేసి అందరిని నవ్వించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.