ఒకప్పుడు తెలుగు లో తెలుగు హీరోయిన్స్ ఉండేవారు. కానీ…రాను రాను తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గి వేరే భాష హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విషయం పైన చాలామంచి గళం విప్పినా కానీ జరిగింది ఏమి లేదు. అలాగే ఫిలిం ఇండస్ట్రీ లో ‘కమిట్మెంట్’ ఎన్నాళ్ళనుండో ఉందని దీని పై శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు కొందరు ఆందోళన చేసారు. కొన్నాళ్ళు దాని పై టీవీ లో డిబేట్లు పెట్టారు…కొన్నాళ్ళకు అందరూ దాని గురించి మర్చిపోయారు.
ఇప్పుడు తాజాగా ఈ విషయం పై తెలుగు నటి తేజస్వి మడివాడ మాట్లాడింది. ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఉందని, కానీ తనకు ఇప్పటివరకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది.
ప్రస్తుతం తేజస్వి ‘కమిట్మెంట్’ అనే మూవీ లో నటిస్తుంది. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెరకెక్కించిన ఈ మూవీలో పరిశ్రమలో హీరోయిన్స్ కి ఎదురయ్యే పరిస్థితులు,లైంగిక వేధింపులు వంటి సమస్యలు చర్చించనున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో తేజస్వి మడివాడ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ లో నా ప్రయాణం మొదలై 9 ఏళ్ళు అవుతుంది. 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి. ఇంత వరకు నాకు బ్రేక్ రాలేదు. సాలిడ్ బ్రేక్ వచ్చేవరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బిగ్ బాస్ షో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై మాత్రం నాకు మంచి సినిమా పడలేదు.
అవకాశాలు లేకపోవడం వలనే అడల్ట్ కంటెంట్ మూవీస్ లో నటిస్తున్నాని కొందరు అంటున్నారు. అవకాశాలు దండిగా ఉన్నప్పుడు కూడా నేను అడల్ట్ కంటెంట్ చిత్రాలు చేశారు. కెరీర్ బిగినింగ్ లోనే ఐస్ క్రీం వంటి బోల్డ్ మూవీలో నటించాను. ప్రతి ఒక్కరి జీవితంలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఆ తరహా చిత్రాల్లో నటిస్తే తప్పేముంది.
కమిట్మెంట్ మూవీ దర్శకుడు నన్ను ఎటువంటి కమిట్మెంట్ అడగలేదు. ఆయన అలా చేస్తే సరిగా నటించేదాన్ని కాను. గిల్లి గిచ్చి నటించమంటే చేయడం చాలా కష్టం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది తరచుగా వినిపించే మాట. అందుకే ఈ సబ్జెక్టు పై మూవీ చేయడం జరిగింది. ఇది మహిళా సాధికారిత గురించిన చిత్రం.
ఇక తెలుగు డర్టీ పిక్చర్ గా కమిట్మెంట్ చిత్రాన్ని చెప్పవచ్చు. డర్టీ మూవీలో డర్టీ లేకుండా ఉండదు. ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక కెరీర్ బిగింనింగ్ లోనే పూరి, రామ్ గోపాల్ వర్మ, శ్రీకాంత్ అడ్డాల వంటి స్టార్ దర్శకుల వద్ద పని చేయడం వలన ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసింది. మా మూవీలో రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది అని చెప్పింది తేజస్వి.