మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. తొలి రోజు దాదాపు పది కోట్ల షేర్ రాబట్టగా, రెండో రోజు కూడా మంచి కలెక్షన్సే సాధించింది. వైష్ణవ్ చేసిన తొలి సినిమా ఇంత మంచి విజయం సాధించడంతో చాలా ఆనందంలో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన నటించిన కృతి శెట్టికు కూడా ఈ మూవీ తొలి సినిమానే అయిన చాలా పరిణితితో నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ధనవంతురాలి కూతురు బేబమ్మ అనే పాత్రలో కృతి శెట్టి నటించింది. నటన, డ్యాన్స్‌లలో చింపేసిన కృతికు ఇప్పుడు తెలుగులోనే కాక తమిళంలోను పలు ఆఫర్స్ వస్తున్నాయట. రెండో సినిమాకు ఈ అమ్మడు దాదాపు 75 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు దర్శక నిర్మాతలు కృతి డేట్స్ కోసం ఎగబడుతున్నారట. అయితే ఉప్పెన సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన కృతి శెట్టి వయస్సు ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కృతి శెట్టి.. చూడడానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తుంది. మరి ఈ అమ్మడు నిజంగానే చిన్న పిల్లా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం కృతి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003లో జన్మించిన కృతి ప్లస్ టూ చదువుతుండగా, ఈ భామకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్‌లోనూ నటించింది. ఈ యాడ్స్‌తోనే కృతి శెట్టి సినిమా ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం కృతి శెట్టి.. నాని శ్యామ సింగ రాయ్‌తో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తుంది . పలు తమిళ సినిమాలలోను కృతికు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుండగా, చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అన్నట్టు రానున్న రోజులలో ఈ అమ్మడు వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.