జయలలిత గురించి ఆఖరి రోజుల్లో శోభన్ బాబు డైరీలో ఏం రాశారో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందారు. ఆంధ్ర సోగ్గాడుగా పిలిచే శోభన్ బాబుకి అప్పట్లో మహిళా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. శోభన్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు మహిళలతో ఆ థియేటర్ లు నిండిపోయేవి. ఇలా ఉంటే జయలలిత శోభన్ బాబు మధ్య గల సంబంధం గురించి అప్పట్లో హాట్ టాపిక్ ఉండేది.

ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ ఉందని, అంతేకాకుండా వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా జన్మించింది అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. శోభన్ బాబు జయలలిత కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా డాక్టర్ బాబు.శోభన్ బాబు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే జయలలిత తెలుగు,తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరో అయినా కూడా జయలలితతో నటించాలని తప్పించే వారట. అలా శోభన్ బాబు కూడా జయలలిత నటించేందుకు తెగ తాపత్రయ పడేవారట. అలా డాక్టర్ బాబు సినిమాలో అవకాశం రావడంతో శోభన్ బాబు ఉబ్బితబ్బిబ్భైపోయారు.

శివ షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించింది. జయలలిత తల్లి ఉన్నంతవరకు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు ఆమెను చూసుకుందట. ఇదే విషయాన్ని శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారు. శోభన్ బాబు డైరీలో.. జయలలిత బంధువులను తన వాళ్ళనుకొని వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే… వాళ్లు ఆమెను మోసం చేసి కొన్ని లక్షలు దోచుకున్నారట. అటువంటి పరిస్థితులలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నాకు తెలియడం లేదని ఆమె చెప్పిందట. వాళ్ళ అమ్మగారు పోయాక ఎన్నో బాధలు పడుతున్న ఆమెకు శోభన్ బాబు వచ్చాక అలాంటి బాధ లేదని తెలియజేసింది అంటూ తన డైరీలో రాసుకున్నారు శోభన్ బాబు.