Vasantha Panchami: వసంత పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి.. ఏ పువ్వులతో పూజించాలి!

Vasantha Panchami: ప్రతి ఏడాది మాఘ మాసం శుక్ల పక్షం ఐదవ రోజు వసంతపంచమి వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వసంత పంచమి వచ్చింది.ఈ వసంత పంచమి రోజు సరస్వతి దేవి జయంతిగా ప్రతి ఒక్కరు భావిస్తారు.అదేవిధంగా బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని కూడా వసంత పంచమి రోజు సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైన వసంత పంచమి రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి… ఎలాంటి పువ్వులతో పూజించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

వసంత పంచమి రోజు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు సరస్వతి దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా తమ పిల్లలు జీవితంలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఎంతో మంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజు తమ పిల్లలకి విద్యాభ్యాసం చేస్తారు. ఇక వసంత పంచమి రోజు అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలు, తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం శుభకరం.

వసంత పంచమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. ఇలా విశ్వం పుట్టినప్పుడు పసుపు ఎరుపు నీలం రంగులు కూడా ఉద్భవించాయని చెబుతారు. ఇలా ఈ మూడు రంగులలో ముందుగా పసుపు రంగు కనిపించింది. వసంతపంచమి రోజే వసంత మాసం కూడా ప్రారంభం అవుతుంది కనుక నేడు అమ్మ వారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు దుస్తులను ధరించి లడ్డులు, క్షీరాన్నం, చెరుకుగడలు, అరటి పండ్లు, పాయసం వంటి మొదలైన నైవేద్యాలను పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.