Actress Hema: నా మొత్తం ఆస్తి విలువ ఎంతంటే..? నేను, నా కూతురు ఇప్పటికీ గంజి తాగి బ్రతికాం హేమ షాకింగ్ కామెంట్స్!

Hema Says, Ratnaprabha will be sent to Assembly

Actress Hema: తనకు 18,19 ఏళ్ల వయసులో వివాహం జరిగిందని, ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు.. ఒకవేళ కెమెరామెన్‌గా సక్సెస్ కాకపోతే తనకు 100 కోట్ల ఆస్తులున్నాయన్న సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై హేమ స్పందించారు. నిజంగా 100 కోట్ల ఆస్తులుంటే తాను దోశల బండి గురించి ఎందుకు మాట్లాడుతానని ఆమె నవ్వుతూ అన్నారు. వంద కోట్లు ఏమీ లేవు కానీ ఉన్న ఆస్తులు మాత్రం బాగానే ఉన్నాయని ఆమె చెప్పారు. తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని, తన కూతురికి సెటిల్ చేసేటంత సంపాదించి ఉంచానని ఆమె తెలిపారు. ఇప్పటికీ సంపాదిస్తూనే ఉన్నానని, ఇక ముందు కూడా సంపాదిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

ఆ పని చిన్నాదా, పెద్దదా అని తాను చూడకుండా అన్ని పనులూ చేస్తానని ఆమె చెప్పారు. కానీ అది ముక్కు సూటిగా ఉండాలి.. తల దించుకునే పనులు మాత్రం చేయనని, అవి కాకుండా ఇంకేం పని ఇచ్చినా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హేమ తెలిపారు. ఊడ్చమన్నారని గానీ, కింద కూర్చోమన్నారని గానీ తాను ఫీలవనని, ఏదైనా తాను కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన అమ్మాయికి కూడా అదే చెప్తానని ఆమె వివరించారు.

కానీ అప్పట్లో ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా గడిచిపోయేదని, సినిమాలకు వెళ్లడం, బైక్ కొనుక్కోవడం అలా అప్పట్లో లైఫ్ చాలా ఎంజాయ్‌ చేశామని, కష్టం, నష్టం అని ఏమీ అనిపించలేదని హేమ చెప్పారు. తాను ఎక్కడున్నా నవ్వుతూ బతికేస్తానని, ఇదే కావాలి, ఇలానే ఉండాలి అని తానెప్పుడూ అనుకోనని ఆమె అన్నారు. తాను ఇప్పటికీ గంజి అన్నం తింటానని, తమ అమ్మాయి, తాను దానికి సూప్ రైస్ అని పేరు కూడా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. తన కూతురు ఎప్పుడైనా సూప్ రైస్ కావాలంటే చేసి ఇస్తానని, అలా చిన్నప్పటి నుంచి తనకు అలవాటు చేశామని, అప్పట్లో రెండు రోజులకు ఒకసారి తినేవాళ్లమని ఆమె తెలిపారు. కానీ ఈ మధ్య తినట్లేదని, ఎందుకంటే దాంట్లో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుందని, దాని వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుందని డాక్టర్స్ చెప్పినట్టు ఆమె వెల్లడించారు. అందుకే తాను రోజుగా కాకపోయినా అప్పుడప్పుడైనా గంజితో కలిపి అన్నం తింటానని ఆమె స్పష్టం చేశారు.

ఏదైనా ఉద్యోగం చేసినా కూడా తనను పోషించేస్తాడనే నమ్మకంతోనే అతన్ని పెళ్లి చేసుకున్నానని సినీ నటి హేమ చెప్పారు. అప్పడంతా వేలల్లోనే లెక్కలేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం లక్షల్లో వేస్తున్నామని ఆమె తెలిపారు. ఒకపుడు 2వేలంటే 20 వేలకు సమానమయ్యేదని, కానీ ఇప్పుడు మాత్రం 2 లక్షలంటే కూడా 20వేలకు సమానం కావట్లేదని ఆమె పోల్చి చెప్పారు. అంటే అప్పటికీ ఇప్పటికీ అన్నింటికీ ఖర్చులు పెరిగిపోయాయని ఓ ఇంటర్వ్యూ ద్వారా హేమ ఆస్తిపాస్తులు గురించి తెలియజేశారు.