ఆకాశంలో మబ్బులు చూసి కుండ ఒంపేసుకున్న రాపాక

rapaka

 వెనకటికి ఒకడు ఆకాశంలో మబ్బులు పట్టటం చూసి, వాన రాబోతుందని ముందుగానే తన కుండలో నీళ్లును ఒంపేసుకొని కూర్చుకున్నాడు, చివరికి వాన పడలేదు సరికదా కుండలో ఉన్న నీళ్లను ఒంపేసుకొని అటు ఇటు కాకుండా పోయాడు. సరిగ్గా ఇదే సూత్రం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు సరిగ్గా సరిపోతుంది. జనసేన తరుపున రాష్ట్రము మొత్తం మీద గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకొని, వైసీపీ,టీడీపీ మధ్య ఏకైక జనసేన ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో రాపాక క్రేజ్ యమా ఊపులో ఉండేది.

rapaka vara prasad telugu rajyam

 అయితే తాను జనసేన ఎమ్మెల్యే కాదని, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అంటూ తనకి తానే చెప్పుకొని వైసీపీ గొడుగు కిందకు వచ్చే ప్రయత్నం చేశాడు. సీఎం జగన్ మనస్సు గెలుచుకొని వచ్చే ఎన్నికల నాటికీ వైసీపీ టిక్కెట్ మీద పోటీచేయాలని కలలు కానీ, అసెంబ్లీ వేదికగా జగన్ ను అతిగా స్తుతించుతూ ప్రసంగాలు చేశాడు, అయితే జగన్ కేవలం ఒక చిరునవ్వు తప్పితే, రాపాకకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అయినాసరే రాజోలు లో వైసీపీ వెంట తిరిగేవాడు. రాజోలు వైసీపీలో అమ్మాజీ,బొంతు రాజేశ్వరరావు వర్గాలుగా చీలిపోవటంతో రాపాక అమ్మాజీ వర్గంతో తిరిగేవాడు.

ఇప్పుడు అమ్మాజీ వర్గం రాపాకను దూరంగా పెట్టటంతో అటు బొంతు వర్గం వైపు వెళ్లలేక ఇటు అమ్మాజీ వర్గంలో ఉండలేక ఒంటరి అయ్యాడు. ఇవన్నీ ఎందుకులే మళ్ళీ జనసేన పార్టీలోకి పోదామంటే జనసైనికులు రాపాక మీద రగిలిపోతున్నారు. వైసీపీకి మద్దతు ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసి మరి వైసీపీ కి దగ్గరయ్యాడు. దీనితో జనసేన పార్టీ రాపాకను దూరం పెట్టేశాయి. రాపాక వాలకం చూసిన వైసీపీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవటం మానేసింది. సరే అయిందేదో అయ్యింది ఎమ్మెల్యే గా చలామణి అవుతూ ఏ వర్గంతో కలవకుండా ఒంటరిగా రాజకీయం చేస్తూ క్యాడర్ ను పెంచుకోవాలని రాపాక చూస్తుంటే స్థానిక అధికారులెవరు ఆయనకు సహకరించటం లేదు. 

  కనీసం స్థానిక ఎమ్మెల్యే అనే గౌరవం కూడా ఇవ్వటం లేదని, రాపాక తరుపు నుండి ఏమైనా పని చేయాలనీ సిపార్సులు వస్తే కనీసం అధికారాలు వాటిని చూడటంలేదు. దీనితో క్యాడర్ లో రాపాక వరప్రసాద్ చులకన అవుతున్నాడు. ఈ విషయాన్నీ ఎవరికీ చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో రాపాక మిగిలిపోయాడు. దీనికి కారణం రాపాక అత్యుత్సహమే అని చెప్పాలి. అతను చేసుకున్న స్వయంకృత తప్పులు వలనే రెంటిడికి చెడ్డ రేవడిగా మారిపోయాడు.