RRR Effect NTR Fans Disappointed : RRR ఎఫెక్ట్ : ఎన్టీఆర్ కి ఏమయ్యింది? రెస్ట్ తీసుకోమంటున్న అభిమానులు.!

RRR Effect NTR Fans Disappointed : మన టాలీవుడ్ లో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) రేపు ఎట్టకేలకు థియేటర్స్ లో సందడి చేయబోతుంది. దర్శక దిగ్గజుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ ని బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ చాలా కష్టపడుతున్నారు.

మరి ఇప్పటికీ కూడా అనేక భాషల్లో ప్రమోషన్స్ కి హాజరవుతున్న ఈ క్రేజీ కాంబో అసలు రెస్ట్ తీసుకోనుంది పాల్గొంటున్నారు. దీనితో ఈ ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ పై గట్టిగా పడినట్టు అనిపిస్తుంది. తాజాగా ఏమైంది అంటే ఎన్టీఆర్ కి తెలుగులో ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ కాగా ఆమె తెలుగులో ప్రశ్న అడిగితే ఎన్టీఆర్ ఏమో హిందీలో సమాధానం చెప్తూ వెళ్ళిపోతున్నాడు.

అయితే సరిగ్గా చూస్తే అక్కడ తాను కావాలని చెప్పింది కూడా కాదు. అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని రీతిలో ఎన్టీఆర్ పరిస్థితి మారి సమాధానం చెప్పాడు. దీనితో అనుకోని రీతిలో తన అభిమానులు షాక్ అయ్యారు. మరీ ఇంత స్థాయిలో ఎన్టీఆర్ ని స్ట్రెస్ చేస్తున్నారని ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో రెస్ట్ తీసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తూ వేడుకుంటున్నారు. మొత్తానికి మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ ప్రభావం ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలోనే పడింది అని చెప్పాలి.