RRR movie : అక్కడి బాక్సాఫీస్ దగ్గర “బాహుబలి 2” ని తుడిచేసిన “RRR” చిత్రం.!

RRR movie : పాన్ ఇండియా వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. పైగా నాలుగు ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న నిరీక్షణ ఇది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.
మరి ఫైనల్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతుండగా ఆల్రెడీ ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ మరియు ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపుతుంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా దగ్గర రికార్డు ఓపెనింగ్స్ అందుకుంటుంది అనుకుంటుండగా అందులో భాగంగానే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం నమోదు చేసింది.
అక్కడ ఇప్పటి వరకు ప్రీమియర్స్ లో ఆల్ టైం ఇండియన్ సినిమా రికార్డు గా ఉన్న “బాహుబలి 2” రికార్డు ని ఈ చిత్రం బ్రేక్ చేసేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా 2.45 మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ షోస్ కి వసూలు చెయ్యగా..
దీనిని బద్దలు కొట్టి RRR చిత్రం 2.5 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2 పేరిట ఉన్న ఇండియన్ సినిమా రికార్డుని తుడిచి పెట్టేసి సరికొత్త ఇండియన్ రికార్డు ను ఈ సినిమాపైకి మార్చుకుంది. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేస్తుందా అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.