NTR: ఆ నెల రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది..?

ప్రపంచ చిత్ర పటంలో తెలుగుదేశం ఏ మూల ఉంటుందో గానీ, ఆ నెల రోజుల్లో తెలుగు నాట జరిగిన సంఘటనలను యావత్ప్రపంచం ఉత్కంఠతో చూసింది. తాజా వార్తల కోసం ప్రతీ క్షణం తహతహ లాడింది. ఇక మన దేశంలో సరేసరి. ఇకపోతే ఇదంతా రాజకీయాల్లో మాములే అంటూ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శించిన ఢిల్లీ పెద్దల దగ్గరనుంచి మారుమూల గ్రామాల్లోని సామాన్య ప్రజల వరకు ఊపిరి సలపని సస్పెన్స్ తో సతమతం అయ్యారు.

ప్రపంచమంతా ఇంత ఆత్రుతతో అంత ఉత్కంఠతో ఎదురు చూడడానికి మూల కారకుడు ఒక సామాన్య రైతు బిడ్డ. ఒకప్పటి చిన్న ఉద్యోగి. సినిమాల్లో అత్యంత పేరు తెచ్చుకున్న నటుడు నందమూరి తారక రామారావు. ప్రజల అండ దండలతో 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్టీఆర్. కొంత కాలం అంతా బాగానే సాగింది. 1984 లో ఎన్టీఆర్ బైపాస్ సర్జరీ నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆయన అలా వెళ్ళగానే పదవి మీద కన్నేసిన కో పైలట్ నాదెండ్ల భాస్కరావు పథకం ప్రకారం ప్లాన్ చేసి ముఖ్య మంత్రి స్థానంలో కూర్చున్నారు.

ఈ వార్త తెలుసుకున్న రామారావు వెంటనే అమెరికా నుంచి వచ్చేశారు. హార్ట్ ఆపరేషన్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు. ఐనా సరే ఎన్టీఆర్ న్యాయ పోరాటం చేశారు. ప్రజల మరియు వివిధ పార్టీల సపోర్ట్ తో పోరాటం చేసిన ఎన్టీఆర్, నెల రోజుల తర్వాత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.