తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం రోజు జిల్లా పర్యటనలో పాల్గొన్నాడు. ఇందులో మరో నేతకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో.. పార్టీలో క్రమశిక్షణ తప్పిందని.. సరిదిద్దడానికి కఠినంగా వ్యవహరిస్తామని అన్నాడు. అంతే కాకుండా అక్కడ సభ వేదిక ఏర్పాటు సక్రమంగా లేకపోవడంతో చంద్రబాబు ప్రసంగాన్ని మీడియా కవర్ చేయడానికి ఇబ్బంది పడింది. కార్యకర్తలు ఆగ్రహించారు.
ఇక నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కొందరి నేతల ఫోటోలను ప్రత్యర్థి వర్గాలు తొలగించడంతో మరింత ఫైర్ అయ్యాడు. ‘ఏయ్.. ఏం కావాలి.. ఎందుకు గొడవ చేస్తున్నారు.. మాట్లాడొద్దు.. మీ జాతకాలు నా దగ్గర.. జాగ్రత్త అంటూ పరిటాల శ్రీరామ్ అనుచరులను గట్టిగా హెచ్చరించాడు చంద్రబాబు. రాప్తాడులో జరిగిన సభలో చంద్రబాబుని అడ్డుకొని పరిటాల శ్రీరామ్ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. అంతే కాకుండా పరిటాల సునీతను వేదికపైకి పిలవక పోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.