నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. రీతూ వర్మ హీరోయిన్. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కాగా, ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ, సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో టీమ్ చాలా డల్‌గా వ్యవహరిస్తోంది.
మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది సినిమా రిలీజ్‌కి. కానీ, ఎక్కడా ఈ సినిమాకి సంబంధించి సౌండ్ ఎక్కడా వినిపించడం లేదు. మరో వైపు అదే రోజు రిలీజ్ కాబోతున్న ‘రొమాంటిక్’ సినిమాకి ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ, ‘వరుడు కావలెను’ సినిమాకి ఇంతవరకూ ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు.
అడపా దడపా విడుదల చేసిన పాటల లిరికల్ సాంగ్ వీడియోలకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. కానీ, అది చాలదు. జోరు పెంచాలి. అసలే సరైన హిట్ లేక తపిస్తున్ననాగ శౌర్య, వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోకుండా, ఈ సినిమా విషయంలో ఎందుకింత సైలెంట్‌గా ఉన్నాడో. చూడాలి మరి, ఇకపై అయినా ‘వరుడు’ ప్రమోషన్స్ జోరందుకుంటాయేమో.