వాట్ ఏ షాట్.. బీరు గ్లాస్ లో బాల్!

కొన్ని కొన్ని సార్లు క్రికెట్ మైదానం లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్ వెళ్లి అక్కడున్న ఆడియన్స్ పై పడటమో లేదా దేనికైనా తగలడమో జరుగుతూ ఉంటుంది. అలా తాజాగా ఓ మ్యాచ్ లో ఏకంగా బీరు గ్లాస్ లో పడింది బాల్.

టెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇన్నింగ్స్ మధ్యలో కివీస్ బ్యాటర్ మిచెల్ సిక్స్ కొట్టగా.. ఆ బంతి నేరుగా వెళ్లి వీక్షించడానికి కూర్చున్న ఓ మహిళ చేతిలో ఉన్న బీరు గ్లాసులో పడింది. దాంతో బీరు ఒక్కసారిగా చిల్లి అక్కడున్న వారి పై పడగా ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు వాట్ ఏ షాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.