Crime: సాధారణంగా చేపలు పట్టడానికి వెళ్లేవారు గాలం సహాయం లేదా వలల సహాయంతో చేపలు పడతారు. మరికొందరు విద్యుత్ పరికరాలను ఉపయోగించి చేపలు పడతారు. అయితే ఇలా విద్యుత్ పరికరాలను ఉపయోగించి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా ఉన్నా పెద్ద ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఓ యువకుడు కరెంటు ద్వారా చేపలు పట్టడం కోసం బయటకు వెళ్లారు అయితే ఊహించని విధంగా ఆ యువకుడు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే…
నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన చెవుల కుమార్, మరో నలుగురు కలిసి చేపలు పట్టడం కోసం వెళ్లారు. ఇలా చేపలు పడుతున్న సమయంలోనే చెవుల కుమార్ కరెంట్ షాక్ కి గురి అయ్యి స్పృహ కోల్పోయి పడిపోయారు. ఇలా ఇతను విద్యుత్ ఘాతానికి గురవడంతో వెంటనే మిగిలిన నలుగురు ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఇలా చేపలు పట్టడం కోసం వెళ్లి విగతజీవిగా తిరిగి రావడంతో చెవుల కుమార్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోదిస్తున్నారు. అయితే విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులైనా ఇప్పటికీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విద్యుత్ ఘాతం వల్ల ఇతను మృతి చెందారా లేదా ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.