వాటికీ బాగా అలవాటు పడిపోయాను: యాంకర్ సుమ

Ancho Suma: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతొందీ యాంకర్ సుమ. బుల్లితెర పై ఏ ఈవెంట్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది. కేవలం బుల్లితెర పైనే కాకుండా సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్ లు, టీజర్ రిలీజ్ వేడుకలు ఇలా ఎక్కడ చూసినా కూడా యాంకర్ సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది. యాంకర్ సుమ తెలుగు నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

యాంకర్ సుమ తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఒకవైపు ఈవెంట్ లు,షూటింగ్ లు అంటూ బిజీబిజీగా ఉంటేనే తనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బుల్లితెరపై ఎంటర్టైన్ చేసిన సినిమా చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. సుమ కనకాల ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయతీ.

ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మే 6న విడుదల కానున్న విషయం అందరికి. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే సుమ వారి విడాకుల రూమర్లపై స్పందించింది. మాకు పెళ్లయి 23 ఏళ్ల లో ఎంతో సంతోషంగా ఉన్నాం..ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా మా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేసి అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసాము. కానీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్ సర్వసాధారణం. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఇలాంటివి తప్పవు. మానసికంగా బాధ కలిగినా కూడా అటువంటి వాటికి అలవాటు పడిపోయాం అంటూ చెప్పుకొచ్చింది సుమ కనకాల.